Sunday, December 13, 2009

ఫ్రేమ ఎంత మధురం

హ్రుదయ సంచలనం



  • బ్రతుకులో ఒక సంచలనం కావలి
  • హ్రుదయంలో పట్టని సంచలనం
  • స్తబ్దంగ ఉన్న జీవితాన్ని ఉరకలెత్తించేందుకు
  • ప్రేమ నీరు ప్రవహించాలి
  • యవ్వన నౌక సాగెందుకు
  • "పిల్ల" గాలి గుండెను తాకాలి
  • గుండె లయలు అలలయి పొంగాలి
  • తన చూపుల మిలమిలలు సోకాలి
  • యవ్వన తేజం తళ తళా మెరవాలి
  • ఊహల నడుమ తన నవ్వులు జలపాతమయి ప్రవహించాలి
  • మాటలు యుగల గీతమయి వినిపించాలి
  • గుప్పిట్లొ ఆమె ఙాపకాలు బందించాలి
  • విప్పగానె పరిమళాలు వెదజల్లాలి
  • జీవితపు ఆఖరి మజిలి చేరాలి
  • అయినా ఙాపకం సరికొత్తగా వుందాలి
  • హ్రుదయమంతా నిండాలి.

తొలి పరిచయం
  • తొలి పరిచయం
  • నీ తొలి పరిచయపు ఙాపకలు
  • చేసెను నాలో వలపు సంతకాలు
  • నీ మాటల కెరటాలు తడుతున్నవి
  • నా గుండె ద్వారాలు
  • నీ స్నేహపు పరిమళాలు
  • మెల్కొలిపెను నాలో అనురాగాలు
  • నీ అమ్రుత నయనాలు గుర్తుకువచ్చి
  • చేస్తున్నవి పదే పదే మనసుకు గాయాలు
  • ఓ చెలి వినిపిస్తున్నాయా నా విన్నపాలు